ఆసియా కప్ 2022లో భారత్‌కి ఇవాళ లాస్ట్ మ్యాచ్

India vs Afghanistan: దుబాయ్ వేదికగా రాత్రి అఫ్గానిస్థాన్‌తో ఢీ

Jyothi
Updated on: 8 Sept 2022 9:02 AM IST
Today is India Last Match in Asia Cup 2022
X

ఆసియా కప్ 2022లో భారత్‌కి ఇవాళ లాస్ట్ మ్యాచ్

India vs Afghanistan: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2022లో భారత్ జట్టు ఈరోజు తన ఆఖరి మ్యాచ్‌ని ఆడబోతోంది. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 7గంటల30 నిమిషాలకు భారత్, అఫ్గానిస్థాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆసియా కప్ 2022 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన ఈ రెండు జట్లు ఈరోజు గెలిచినా.. ఓడినా ఇంటిబాట పట్టడం లాంఛనమే కానుంది. కానీ.. అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ 2022 జరగనుండటంతో కనీసం విజయంతో టోర్నీని ముగించాలని భారత్ ఆశిస్తోంది. అఫ్గానిస్థాన్‌తో ఈరోజు మ్యాచ్ నామమాత్రమే కావడంతో జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. సీనియర్లకి రెస్ట్ ఇచ్చి.. బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకి ఛాన్స్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story