India Vs Pakistan: ఇవాళ భారత్ వర్సెస్ పాక్ సంగ్రామం..

India Vs Pakistan: ఆసియా కప్‎లో ఆసక్తికర పోరుకు రంగం

Jyothi
Published on: 28 Aug 2022 7:34 AM IST
Today India vs Pakistan Match
X

India Vs Pakistan: ఇవాళ భారత్ వర్సెస్ పాక్ సంగ్రామం..

India Vs Pakistan: ఆసియా కప్‌లో భాగంగా భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా భారత్‌- పాక్ మధ్య ఇవాళ రాత్రి 7గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ చేతిలో ఓడిన భారత్‌.. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉంది. అటు ప్రత్యర్థి పాక్‌ కూడా భారత్‌పై నెగ్గాలని ఉవ్విళ్లూరుతోంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేశ్‌ కార్తిక్‌లతో కూడిన భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. అటు.. పాక్‌ జట్టులోనూ బాబర్ అజామ్, మహ్మద్‌ రిజ్వాన్, ఫకర్ జమాన్‌లతో కూడిన బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.

Jyothi

Jyothi

Next Story