IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్.. ఇవాళ వాంఖడే వేదికగా సెమీస్ ఫైట్

IND vs NZ: ఒక్క ఓటమి లేకుండా నాకౌట్‌ దశకు చేరిన రోహిత్‌ సేన

Jyothi
Published on: 15 Nov 2023 10:21 AM IST
Today First Semi Final World Cup 2023
X

IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్.. ఇవాళ వాంఖడే వేదికగా సెమీస్ ఫైట్

IND vs NZ: ప్రపంచకప్ 2023లో తొలి సెమీస్ పోరుకు ముంబై వాంఖడే స్డేడియం సిద్ధమైంది. మరి కొన్ని గంటల్లోనే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రసవత్తర పోరు ప్రారంభం కానుంది. లీగ్ దశలో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్నా.. ప్రత్యర్ధి న్యూజిలాండ్ కావడంతో ఎక్కడో గుబులు రేగుతోంది. నాటి ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రతి క్రికెట్ అభిమాని ఆశిస్తున్నాడు. అటు పేసర్లు, స్పిన్నర్లు, ఇటు బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తూ 9 విజయాలతో దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు ఎప్పటిలానే కివీస్ కళ్లెం వేస్తుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ సెమీపైనల్స్‌లో టీమ్ ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. అందుకే ఆ ఓటమికి ఇప్పుడు ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉందని.. కచ్చితంగా ఈ మ్యాచ్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది.

మధ్యాహ్నం 2 గంటలకు ముంబై వాంఖడే స్టేడియం వేదికగా తొలి సెమీఫైనల్‌ జరగనుంది. భారత్‌తో న్యూజిలాండ్‌ తలపడనుంది. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌ టోర్నీలో.. ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది రోహిత్‌ సేన. ఒక్క ఓటమి లేకుండా నాకౌట్‌ దశకు చేరిన టీమిండియా.. ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అయితే.. అటు ప్రత్యర్థి జట్టు కివీస్‌ మాత్రం.. 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలను తమ ఖాతాలో వేసుకుంది. 2019 ప్రపంచకప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో.. ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే యోచనలో టీమిండియా ఉంది. దీంతో ఇవాళ జరగబోయే ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ టఫ్‌ ఫైట్‌గా మారనుంది.

Jyothi

Jyothi

Next Story