INS vs SA: భారత్‌ - సౌతాఫ్రికా మధ్య నేడు చివరి వన్డే

INS vs SA: ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

Jyothi
Updated on: 11 Oct 2022 1:30 PM IST
Today 3rd ODI Match Between India and South Africa
X

INS vs SA: భారత్‌ - సౌతాఫ్రికా మధ్య నేడు చివరి వన్డే 

INS vs SA: టీమ్​ఇండియా - దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి వన్డే మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. తొలి వన్డేలో ఓడినా, బలంగా పుంజుకుని రెండో మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌ ఇండియా ఫుల్​జోష్‌లో ఉంది. అయితే ఇదే ఉత్సాహంతో మూడో వన్డేలోకి బరిలోకి దిగనుంది. అలాగే ఇదే మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ నెగ్గాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. బౌలర్లకంటే బ్యాటర్స్‌ మంచి ఫామ్‌లో ఉండడం మనకు కలిసిరానుంది. సంజు శాంసన్‌, ఇషాన్‌కి తోడు శ్రేయస్‌ అయ్యర్‌ ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు కొట్టి అందరికంటే ముందువరుసలో నిలిచాడు. అయితే ఓపెనింగ్‌ జంట ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌ల ఫామే కాస్త ఆందోళన కలిగిస్తోంది. సిరీస్‌లో ఇప్పటివరకు వీళ్లిద్దరు రాణించలేదు. ఇక చివరి వన్డేలో భారత్‌ను అడ్డుకోవడం సఫారీ జట్టుకు పెద్ద సవాలే. కెప్టెన్‌ బవుమా పేలవ ఫామ్‌ దక్షిణాఫ్రికాకు పెద్ద ప్రతికూలాంశం. ఘోర వైఫల్యాల నేపథ్యంలో రెండో వన్డేకు విశ్రాంతి తీసుకున్న బవుమా.. ఈ మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగే అవకాశముంది.

Jyothi

Jyothi

Next Story