కోహ్లి ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. ఇక తప్పుకో : గంభీర్

కోహ్లి ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. ఇక తప్పుకో : గంభీర్
x
Highlights

ఐపీఎల్ 13 వ సీజన్ లో నిన్న హైదరాబాదు జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోహ్లి సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే.. అయితే ఫాన్స్ నుంచి కోహ్లి పైన తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది..

ఐపీఎల్ 13 వ సీజన్ లో నిన్న హైదరాబాదు జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోహ్లి సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే.. అయితే ఫాన్స్ నుంచి కోహ్లి పైన తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది.. ఆర్సీబీ కెప్టెన్ గా కోహ్లి తప్పుకోవాలనే విమర్శలు వస్తున్నాయి.. ఈ నేపద్యంలో ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన గంభీర్‌ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు..

గత ఎనిమిదేళ్ల నుంచి అర్సీబీకి కోహ్లీ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడని కానీ ఒక్కసారి కూడా జట్టుకు కప్ ను అందించాలేకపోయాడని విమర్శించాడు గంభీర్. అయితే కోహ్లిని కెప్టెన్ గా కొనసాగించవద్దునని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని గంభీర్ పేర్కొన్నాడు. ఇక రోహిత్, ధోనిలతో కోహ్లిని పోల్చలేమని అన్నాడు. ధోనీ చెన్నైకి మూడు సార్లు, రోహిత్‌ ముంబయికి నాలుగుసార్లు టైటిల్స్‌ అందించారని అందుకే వారు ఇంకా ఆ జట్లకి కెప్టెన్ గా ఇన్నిసార్లు కొనసాగుతున్నారని గంభీర్ వ్యాఖ్యనించాడు..

అంతేకాకుండా అర్సీబీ జట్టు ఎక్కువగా కోహ్లి, డివిలియర్స్ పైన ఆధారపడుతుందని అన్నాడు. ఈ సీజన్ లలో ఆర్సీబీ పూర్తిగా విఫలం కాకుండా డీవిలియర్స్ కొన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడని కితాబిచ్చాడు గంభీర్.. ఇక ఒక కెప్టెన్‌గా గెలిచినప్పుడు ఎలాగైతే క్రెడిట్‌ దక్కుతుందో ఓటమిపాలైనప్పుడు కూడా అలాగే విమర్శలు ఎదుర్కోవాలని గంభీర్ సూచించాడు.. అటు నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో అర్సీబీ ఏడూ వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య చేదనలో హైదరాబాదు జట్టు కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories