పాకిస్థాన్‌లో పర్యటించనున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు తాలిబన్ల భయం

* ఆటగాళ్ల ఆందోళనపై స్పందించిన న్యూజిలాండ్ బోర్డు * భద్రత, కొవిడ్-19 పరిస్థితులపై అంచనా వేయాలని రెగ్ డికాసన్‌ను కోరింది

Sandeep Reddy
Updated on: 20 Aug 2021 9:00 AM IST
The Taliban Fear The New Zealand Team Will Tour Pakistan
X

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు (ఫైల్ ఫోటో)

New Zealand: 18 ఏళ్ల తర్వాత తొలిసారి పాకిస్థాన్‌లో పర్యటించనున్న న్యూజిలాండ్ జట్టును తాలిబన్ల భయం వేధిస్తోంది. పాక్ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్థాన్ ఇప్పుడు తాలిబన్ల వశం కావడంతో భయపడుతున్న పలువురు కివీస్ ఆటగాళ్లు పాకిస్థాన్ పర్యటనకు ససేమిరా అంటున్నారు. ఆటగాళ్ల ఆందోళనపై స్పందించిన న్యూజిలాండ్ బోర్డు అంతర్జాతీయ సెక్యూరిటీ కన్సల్టెంట్, నిపుణుడు రెగ్ డికాసన్‌ను ఆశ్రయించింది. ఈ వారం తర్వాత పాకిస్థాన్‌ను సందర్శించి భద్రత, కొవిడ్-19కు సంబంధించిన పరిస్థితులపై అంచనా వేయాలని కోరింది. ఆయన ఇచ్చే నివేదికను బట్టి తమ జట్టును పాకిస్థాన్‌కు పంపాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story