Sania Mirza: టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా సంచలన నిర్ణయం

Sania Mirza: టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా సంచలనం నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Updated on: 19 Jan 2022 7:03 PM IST
Tennis Player Sania Mirza Announces Retirement
X

Sania Mirza: టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా సంచలన నిర్ణయం

Sania Mirza: టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ తర్వాత రిటైర్ అవనున్నట్లు ప్రకటించింది. ఆ టోర్నీ అనంతరం తాను ఆటకు గుడ్ బై కొట్టనున్నట్లు తెలిపింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఆడాలని ఉన్నా తనకు ఆరోగ్యం ఏ మాత్రం సహకరించడం లేదని ,ఆడాలన్న తపన, మోటివేషన్, ఎనర్జీ లెవెల్స్ లో మార్పొలొస్తున్నాయని సానియా వివరించింది. మరోవైపు టోర్నీల్లో ఆడేందుకు తరచు ప్రయాణాల వల్ల కుమారుడిని రిస్క్ లో పెడుతున్నట్లు అవుతోందని కరోనా వల్ల తానింక రిస్క్ తీసుకోదలచుకోలేదని సానియా తెలిపింది.

35 ఏళ్ల సానియా 2019లో బాబుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అడపా దడపా ఆడుతున్నా ఆమెను పరాజయాలే వెంటాడాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ విమెన్స్ డబుల్స్ టోర్నీ ఫస్ట్ రౌండ్ లో ఓటమి పాలయ్యాక సానియా ఈ నిర్ణయం తీసుకుంది. మోకాలి నొప్పి కూడా సానియా నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. అయితే ఓటమికి మోకాలి నొప్పి ఒకటే కారణం కాదని, తన ఆరోగ్యం, తన కుటుంబ ఆరోగ్యం కూడా తనకు ముఖ్యమని తోచిందని సానియా వివరించింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story