Tejaswin Shankar: స్వర్ణ పతకం సాధించిన తేజస్విన్ శంకర్
Tejaswin Shankar: భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ అద్భుత జంప్ తో మరో స్వర్ణం సాధించాడు.
తేజస్విన్ శంకర్ (ఫొటో ట్విట్టర్)
Tejaswin Shankar: భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ అద్భుత జంప్ తో మరో స్వర్ణం సాధించాడు.అమెరికాలో జరుగుతున్న బిగ్-12 అవుడ్‌డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్ షిప్‌లో పాల్గొన్న ఈ 22 ఏళ్ల ఆటగాడు..2.28 మీటర్ల ఎత్తుకు ఎగిరి తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే, తేజస్విన్ శంకర్ కేన్సన్ స్టేట్ యూనివర్సిటీ తరుపున బరిలోకి దిగాడు.
కాగా, ఈ టోర్నీలో తేజస్విన్ శంకర్‌కిది రెండో గోల్డ్ మెడల్. 2019లో అతను బంగారు పతకాన్ని గెలవగా.. మళ్లీ 2021లో రెండో గోల్డ్ మెడల్ సాధించాడు. తమిళనాడుకు చెందిన తేజస్విన్ శంకర్.. 2017లో యూఎస్‌ఏకు వెళ్లి.. కేన్సస్ స్టేట్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును చదువుతున్నాడు.
Next Story




