రాజ్‌కోట్ టీ-ట్వంటీలో టీమిండియా విజయభేరి

రాజ్‌కోట్ టీ-ట్వంటీలో టీమిండియా విజయభేరి
India vs South Africa: టీట్వంటీల్లో రెండో విజయాన్ని నమోదుచేసిన టీమిండియా
India vs South Africa: రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రితో జరుగుతున్న టీట్వంటీ మ్యాచ్‌లో టీమిండియా విజయభేరి మోగించింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న దక్షిణాఫ్రికాపై వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసి సమంచేసింది. సిరీస్ కైవసం చేసుకోడానికి ఇరుజట్లు సమ ఉజ్జీలుగా బెంగళూరులో జరుగనున్న ఐదో మ్యాచులో తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన సౌతాఫ్రికా... మ్యాచ్‌ను చేజార్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో అరు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.
170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చతికిల పడింది. భారత బౌలర్లు అద్భుతమైన బంతులు సంధించి బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించారు. భారత బౌలర్ ఆవేశ్ ఖాన్ తనదైన శైలిలో బంతుల్ని సంధించి కీలకమైన వికెట్లను పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ రాణించలేకపోవడంతో పరాజయాన్ని చవిచూసింది. టీమిండియా తరఫున దినేశ్ కార్తిక్ అద్భుతమైన ఆటతీరుతో గౌరవప్రదమైన స్కోరు సాధించిపెట్టాడు. వ్యక్తిగతంగా 27 బంతులు ఎదుర్కొన్న దినేశ్ కార్తిక్ 9 బౌండరీలు, రెండు సిక్సర్లతో 55 పరుగులు అందించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
హార్థిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించి 31 బంతుల్లో 3 బౌండరీలు, 3 సిక్సర్లతో 46 పరుగులు నమోదు చేశాడు. ఇషాన్ కిషన్ 27 పరుగులు అందించాడు. రిషబ్ పంత్ 17 పరుగులతో నిలిచాడు. 16 ఓవర్ల 5 బంతుల్లో 87 పరుగులతో దక్షిణాఫ్రికా ఆలౌటైంది. ఆవేశ్ ఖాన్, ఛాహల్ బౌలింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయం చేజిక్కించుకుంది.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
నిధుల సేకరణ కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. రాజధాని భూముల అమ్మకానికి...
25 Jun 2022 4:15 PM GMTటీచర్ల ఆస్తుల వెల్లడి ఆదేశాలపై వెనక్కి తగ్గిన టీ సర్కార్
25 Jun 2022 4:00 PM GMTHealth Tips: చెమట విపరీతంగా పడుతోందా.. అయితే డైట్లో ఈ మార్పులు...
25 Jun 2022 3:30 PM GMTతెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..
25 Jun 2022 3:15 PM GMTVikarabad: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే మా శవాలు చూస్తారు!
25 Jun 2022 2:54 PM GMT