టీమిండియా విజయం.. సెంచరీ చేసినా విజయం వరించలేదని మిల్లర్ భావోద్వేగం

*మిల్లర్‌ను ఓదార్చిన టిమిండియా కెప్టన్ రోహిత్ శర్మ, కోహ్లీ

Rama Rao
Published on: 3 Oct 2022 6:52 AM IST
Team India win in Guwahati | IND vs SA Highlights
X

టీమిండియా విజయం.. సెంచరీ చేసినా విజయం వరించలేదని మిల్లర్ భావోద్వేగం

IND vs SA Highlights: టీమిండియా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో భావోద్వేగ క్షణాలు క్రికెట్ అభిమానుల గుండెలను పిండేశాయి. గువాహటిలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, టీమిండియాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 237 పరుగులు చేసింది. 238 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నింపాదిగా ఆడుతూ లక్ష్యాన్ని చేరువయ్యే ప్రయత్నంలో డేవిడ్ మిల్లర్ థ్రిల్లింగ్ షాట్లతో అదరగొట్టాడు.

47 బంతుల్లో 8 బౌండరీలు, 7 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓవర్లు అయిపోయాయి. 16 పరుగుల తేడాతో విజయం టీమిండియాను వరించింది. అయితే క్రీడాకారులు పరస్పరం అభినందనలు తెలిపే సన్నివేశంలో మిల్లర్‌‌ సెంచరీ వృధా అయిందని రోహిత్‌ శర్మ, మిల్లర్ శ్రమ ఫలించలేకపోయిందని విరాట్ కోహ్లీ కాసేపు భావోద్వేగ క్షణాలతో గడిపారు. డేవిడ్ మిల్లర్ కళ్లల్లో నీళ్లు తొణికిసలాడాయి. ఈ సన్నివేశం క్రికెట్ అభిమానుల గుండెలను పిండేశాయ.

Rama Rao

Rama Rao

Next Story