Ind Vs NZ First Test: "డ్రా" కోసం కివీస్ ఆరాటం.. "గెలుపు" కోసం భారత్ పోరాటం

Sandeep Reddy
Updated on: 29 Nov 2021 3:39 PM IST
Team India Trying to win First Test Match Against New Zealand in Kanpur Test
X

Ind Vs NZ First Test: "డ్రా" కోసం కివీస్ ఆరాటం.. "గెలుపు" కోసం భారత్ పోరాటం

India Vs New Zealand First Test: కాన్పూర్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో 284 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్ టామ్ లాథమ్ (52)మినహా ఎవరు అంతగా రాణించకపోవడంతో 143 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ ని కుప్పకూల్చారు.

అక్సర్ పటేల్, ఉమేష్ యాదవ్ తల ఒక వికెట్ తో బౌలింగ్ లో ఫర్వాలేదనిపించారు. ఇక గెలుపు కోసం కాకున్నా మ్యాచ్ ని డ్రా చేయడానికి కివీస్ ఆటగాళ్ళు ప్రయత్నిస్తుండగా.. లోయర్ ఆర్డర్ ని కూడా వీలైనంత త్వరగా పెవిలియన్ పంపి మొదటి టెస్ట్ లో విజయాన్ని సాధించాలని టీమిండియా తహతహలాడుతుంది.

భారత జట్టు

ఫస్ట్ ఇన్నింగ్స్ : 345-10

సెకండ్ ఇన్నింగ్స్ : 234-7 డిక్లర్

న్యూజిలాండ్ జట్టు

ఫస్ట్ ఇన్నింగ్స్ : 296-10

సెకండ్ ఇన్నింగ్స్ : 143-7

Sandeep Reddy

Sandeep Reddy

Next Story