Team India: ఇంగ్లండ్ తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న టీమిండియా..షెడ్యూల్ ఇదిగో!

Team India to tour England again in 2026, Fixtures and venues revealed
x

Team India: ఇంగ్లండ్ తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న టీమిండియా..షెడ్యూల్ ఇదిగో!

Highlights

Team India: టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య వచ్చే ఏడాది జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది.

Team India: టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య వచ్చే ఏడాది జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనలో భారత్ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

ఈ వైట్ బాల్ క్రికెట్ సిరీస్ 2026 జూలై 1 నుంచి ప్రారంభమవుతుందని బీసీసీఐ వెల్లడించింది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను బోర్డు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ పర్యటనలో టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై కీలక సిరీస్‌లను ఎదుర్కొనబోతుండటంతో క్రికెట్ ప్రేమికుల్లో భారీ ఆసక్తి నెలకొంది. టీ20 వరల్డ్‌కప్ తర్వాత జరిగే ఈ సిరీస్‌ ప్రపంచకప్‌కు బరిలోకి దిగే జట్ల ప్రిపరేషన్‌కు కీలకంగా మారనుంది. సిరీస్‌ తేదీలతో పాటు వేదికల వివరాలను బీసీసీఐ త్వరలో వెల్లడించనుంది.

టీ20 సిరీస్

మొదటి టీ20- జులై 1 (డుర్హామ్)

రెండో టీ20- జులై 4 (మాంచెస్టర్)

మూడో టీ20- జులై 7 (నాటింగ్ హామ్)

నాలుగో టీ20- జులై 9 (బ్రిస్టల్)

ఐదో టీ20 (సౌతాంప్టన్)

వన్డే సిరీస్

మొదటి వన్డే- జులై 14 (బర్మింగ్ హామ్)

రెండో వన్డే- జులై 16 (కార్డిఫ్)

మూడో వన్డే- జులై 19 (లార్డ్స్)



Show Full Article
Print Article
Next Story
More Stories