Ind vs Eng: ఇంగ్లాండ్ దూకుడు.. మాంచెస్టర్లో కష్టాల్లో టీమిండియా.. రెండో రోజు పరిస్థితి ఇది

Ind vs Eng
x

Ind vs Eng: ఇంగ్లాండ్ దూకుడు.. మాంచెస్టర్లో కష్టాల్లో టీమిండియా.. రెండో రోజు పరిస్థితి ఇది

Highlights

Ind vs Eng: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది.

Ind vs Eng: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియాను 358 పరుగులకు ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ప్రస్తుతం, ఇంగ్లాండ్ భారత్ కంటే 133 పరుగుల వెనుకంజలో ఉంది. అయితే, ఇంగ్లాండ్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ వరుసగా 94 పరుగులు, 84 పరుగులు చేసి జట్టుకు సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. భారత జట్టు తరఫున రవీంద్ర జడేజా, అన్షుల్ కంబోజ్ చెరో ఒక వికెట్ తీశారు.

జాక్ క్రాలీ, బెన్ డకెట్ ఇంగ్లాండ్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరి మధ్య మొదటి వికెట్‌కు 166 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఈ భాగస్వామ్యాన్ని రవీంద్ర జడేజా బద్దలు కొట్టాడు. క్రాలీ 113 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 84 పరుగులు చేసి జడేజాకు చిక్కాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న బెన్ డకెట్‌ను అన్షుల్ కంబోజ్ అవుట్ చేశాడు. డకెట్ 13 ఫోర్ల సహాయంతో 94 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రోజు ఆట ముగిసే సమయానికి ఓలీ పోప్ 42 బంతుల్లో 20 పరుగులు, జో రూట్ 27 బంతుల్లో 11 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. వీరు మూడో రోజు ఆటను కొనసాగిస్తారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టు తరఫున యశస్వి జైస్వాల్ 58 పరుగులు, రిషబ్ పంత్ 54 పరుగులు సాధించగా, సాయి సుదర్శన్ 61 పరుగులు చేసి ముఖ్యమైన పరుగులు అందించారు. ఇంగ్లాండ్ తరఫున బెన్ స్టోక్స్ అద్భుతంగా రాణించి ఐదు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా, క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరో ఒక వికెట్ తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories