కెప్టెన్ గా రాహుల్, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్..

Team India Squad for the Upcoming T20I Home Series Against South Africa
x

కెప్టెన్ గా రాహుల్, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్..

Highlights

Team India Squad: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరిస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Team India Squad: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరిస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సహా పలువురు సీనియర్లకు చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెక్షన్‌ కమిటీ విశ్రాంతి ఇచ్చింది. జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా, రిషబ్‌ పంత్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. ఇంగ్లండ్‌ సిరిస్‌కు సంబంధించి రీషెడ్యూల్‌ చేసిన టెస్ట్‌ కోసం సైతం బీసీసీఐ జట్టును ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్‌లో కరోనా మహమ్మారి కారణంగా టెస్ట్‌ మ్యాచ్‌ వాయిదా పడింది. మ్యాచ్‌ జూలై 1 నుంచి 5వ తేదీ వరకు భారత్‌ – ఇంగ్లాండ్‌ మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ జరుగునుంది. అయితే, మ్యాచ్‌కు ఛటేశ్వర్‌ పూజారాను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అజింక్యా రహానేకు మాత్రం చోటు దక్కలేదు.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌కు భారత టెస్ట్‌ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Show Full Article
Print Article
Next Story
More Stories