IND Vs SA: ఇవాళ భారత్‌-దక్షిణాఫ్రికా రెండో వన్డే మ్యాచ్‌

IND Vs SA: పార్ల్‌ వేదికగా మ.2 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

Rama Rao
Published on: 21 Jan 2022 8:34 AM IST
Team India-South Africa Match‌ Today
X

ఇవాళ భారత్‌-దక్షిణాఫ్రికా రెండో వన్డే మ్యాచ్‌

IND Vs SA: నేడు భారత్, దక్షిణాఫ్రికా రెండో వన్డే జరగనుంది. టెస్టు సిరీస్‌ను కోల్పోయి, కనీసం వన్డే సిరీస్‌నైనా చేజిక్కించుకోవాలని ఆరాటపడుతున్న టీమ్ ఇండియా ఇవాళ మధ్యాహ్నం జరిగే కీలకమైన రెండో వన్డేలో దక్షిణాఫ్రికాను డీకొంటుంది. వన్డే సిరీస్‌లో నిలవాలంటే రెండో వన్డేలో సఫారీలపై కచ్చితంగా గెలవాల్సిందే. మొదటి మ్యాచ్‌లో మిడిలార్డర్ వైఫల్యంతో 31 పరుగులతో ఓటమిపాలైన టీమిండియా ఈ వన్డేలో గెలిచి సిరీస్‌ సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలను కొనసాగిస్తూ రెండో వన్డేలో సిరీస్ గెలవాలని సఫారీ జట్టు కోరుకుంటోంది. ఈ క్రమంలో మొదటి వన్డే జరిగిన బోలాండ్ పార్క్‌లోనే మరోసారి టీమిండియా, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story