Test Series: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా జట్టు ఎంపిక

Test Series: ఈ నెల 25 నుంచి రెండు టెస్టుల సిరీస్

Sandeep Eggoju
Published on: 12 Nov 2021 3:28 PM IST
Team India Selected for Test Series with New Zealand
X

న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కు టీం ఇండియా జట్టు ఎంపిక (ఫైల్ ఇమేజ్)

Test Series: టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ నెల 25 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ భార‌త జ‌ట్టును ప్రక‌టించింది. ఈ కీలక సిరీస్‌లో ఫస్ట్ టెస్టుకు కెప్టెన్‌గా అజింక్యా ర‌హానే వైస్ కెప్టెన్‌గా ఛతేశ్వర్ పుజారా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. రెండో టెస్టులో కోహ్లీ ఆడ‌తాడ‌ని, జ‌ట్టుకి సార‌థిగా బాధ్యత‌లు నిర్వహిస్తాడ‌ని బీసీసీఐ ప్రక‌టించింది. ఇక.. కివీస్‌తో సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో.. కేఎల్ రాహుల్‌, మ‌యాంక్ అగ‌ర్వాల్, శుభ్‌మ‌న్ గిల్, శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భ‌ర‌త్, ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జ‌యంత్ యాద‌వ్, ఇషాంత్ శ‌ర్మ‌, ఉమేశ్ యాద‌వ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణలకు చోటు దక్కింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story