Rohit Sharma: టీమిండియాకు షాక్.. ప్రాక్టీసులో రోహిత్ శర్మకి గాయం

Sandeep Reddy
Updated on: 13 Dec 2021 4:18 PM IST
Rohit Sharma Injured in Net Practice in Mumbai - India Tour of South Africa 2022 | Cricket News in Telugu
X

Rohit Sharma: టీమిండియాకు షాక్.. ప్రాక్టీసులో రోహిత్ శర్మకి గాయం

Rohit Sharma - India Tour of South Africa 2022: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియాకు గట్టిషాక్ తగిలింది. ముంబైలోని శరద్ పవార్ అకాడమీలో ప్రాక్టీసులో పాల్గొన్న రోహిత్ శర్మకు గాయమైంది. టీమిండియా త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘుతో త్రో డౌన్స్ ప్రాక్టీస్ చేశాడు. అయితే రఘు వేసిన ఒక త్రో డౌన్ రోహిత్ శర్మ గ్లౌవ్స్‌ ను బలంగా తాకడంతో రోహిత్ శర్మ నొప్పితో విలవిలలాడాడు. గాయం కారణంగా వెంటనే రోహిత్ ప్రాక్టీస్ ముగించాడు. ప్రస్తుతానికి హిట్ మ్యాన్ గాయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే సోమవారం సాయంత్రం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే టీమిండియా బయో బుబల్‌లోకి వెళ్లనుంది. డిసెంబర్ 16న టీమిండియా ప్రత్యేక విమానంలో దక్షిణాఫ్రికాకి బయలుదేరనుంది. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు 3 టెస్ట్‌లు, 3 వన్డేలు ఆడనుంది. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ కి గాయం కారణంగా దూరమైన రోహిత్ శర్మకి తాజాగా గాయం కావడంతో అటు భారత జట్టుతో పాటు అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ గాయం పెద్దది అయితే మాత్రం రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story