Ravindra Jadeja: టెస్ట్‌ క్రికెట్‌ కు రవీంద్ర జడేజా గుడ్ బై..!?

Sandeep Reddy
Updated on: 9 Dec 2021 1:40 PM IST
Team India Player Ravindra Jadeja Going Says Good Bye to Test Cricket Soon
X

Ravindra Jadeja: టెస్ట్‌ క్రికెట్‌ కు రవీంద్ర జడేజా గుడ్ బై..!?

Ravindra Jadeja: టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా త్వరలో టెస్ట్‌ క్రికెట్‌కు త్వరలో గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండవ టెస్ట్‌కు మోకాలి గాయంతో జడేజా తప్పకున్న సంగతి తెలిసిందే. అయితే మోకాలి సర్జరీ తరువాత దాదాపుగా 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్న జడేజా టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా జడేజా సన్నిహితుడు ఒక ప్రముఖ పత్రికకు తెలిపారు.

గాయం కారణంగానే దక్షిణాఫ్రికా పర్యటనకి కూడా జడేజా దూరమయ్యాడు. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ లో 57 మ్యాచ్‌లు ఆడిన రవీంద్ర జడేజా 2195 పరుగులతో పాటు 232 వికెట్లు పడగొట్టాడు. మరోపక్క చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం రవీంద్ర జడేజాని 16 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story