R Ashwin: అతడిని నెంబర్ 1 అనడం నచ్చలేదు..ఆ ఒక్క మాటతో బస్సుకింద తోసినట్లు అనిపించింది

Sandeep Reddy
Published on: 22 Dec 2021 12:21 PM IST
Team India Player Ravichandran Ashwin Comments on Former India Coach Ravi Shastri
X

R Ashwin: అతడిని నెంబర్ 1 అనడం నచ్చలేదు..ఆ ఒక్క మాటతో బస్సుకింద తోసినట్లు అనిపించింది

Ravichandran Ashwin: టీమిండియా స్పిన్న‌ర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా ఒక స్పోర్ట్స్ ఛానల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందించాడు. 2018-19 లో ఆస్ట్రేలియా వేదిక‌గా టీమిండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకొని చ‌రిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ విజ‌యానంతరం అప్ప‌టి టీమిండియా కోచ్ ర‌విశాస్త్రి మాట్లాడుతూ విదేశాల్లో స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ నెంబర్ 1 బౌల‌ర్ అని చెప్పడం తాను త‌ట్టుకోలేక‌పోయాన‌ని ర‌విచంద్ర‌న్ అశ్విన్ చెప్పాడు.

ర‌విశాస్తి వ్యాఖ్య‌లు నన్ను చాలా బాధపడేలా చేశాయని.., అప్పుడు నేను బ‌స్సు కింద తోసేసినట్లు అనిపించిందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ తరువాత జరిగిన పార్టీకి కూడా తాను వెళ్లలేదని.. పార్టీలో పాల్గొనాలంటే ఆ విజ‌యంలో త‌న పాత్ర ఉండాల‌నుకుంటాన‌ని కాని రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలలో గెలుపులో నా పాత్ర ఏమిలేదని అనిపించిందనట్టు మాట్లాడటం తనకి ఎంతో బాధ కలిగించిందని అశ్విన్ అన్నాడు.

ఇక పార్టీలో పాల్గొనకుండా రూమ్ కి వెళ్లి తన భార్య, పిల్లలతో ఉన్నానని తరువాత వాళ్ళు నచ్చజెప్పడంతో మనసు మార్చుకొని తిరిగి పార్టీలో పాల్గొన్నట్లు అశ్విన్ తెలిపాడు. ఇక ఆస్ట్రేలియాలో స్పిన్న‌ర్లు 5 వికెట్లు తీయ‌డం ఎంత క‌ష్ట‌మో త‌న‌కు తెలుస‌ని..కుల్దీప్‌ యాదవ్ కు 5 వికెట్లు దక్కినందుకు సంతోషం కలిగిందని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story