Team India Former Cricketer Virender Sehwag: నిజమైన అభిమానులైతే గొడవలు ఆపండి: వీరేంద్ర సెహ్వాగ్

Team India Former Cricketer Virender Sehwag: ధోనీ, రోహిత్ శర్మ అభిమానుల మధ్య గర్షణ జరిగింది.

S. Srikanth
Published on: 23 Aug 2020 5:13 PM IST
Team India Former Cricketer Virender Sehwag: నిజమైన అభిమానులైతే గొడవలు ఆపండి: వీరేంద్ర సెహ్వాగ్
X

Virender Sehwag(File Photo)

Team India Former Cricketer Virender Sehwag: ధోనీ, రోహిత్ శర్మ అభిమానుల మధ్య గర్షణ జరిగింది. మహారాష్ట్ర కొల్హాపూర్ జిల్లాలో ధోనీ రిటైర్మెంట్ సంధర్భంగా అతడి ఫ్యాన్స్ ఫ్లెక్సిలు ఏర్పాటు చేసారు. అలాగే, ఖేల్ రత్న అవార్డు వచ్చినందుకు రోహిత్ ఫ్యాన్స్ సైతం ఫ్లెక్సిలు ఏర్పాటు చేసారు. అయితే, రోహిత్ ఫ్లెక్సిలను గుర్తు తెలెయని వ్యక్తులు తొలగించడంతో వివాదం రేగింది. హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఒకరు ధోనీ అభిమానులను దుషించడంతో అతడిని చెరుకు తోటలోకి తీసుకెళ్లి కోటడం జరిగింది.

ఈ సంఘటనపై టీంఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన స్పందిస్తూ.. 'ఆటగాళ్లు ఎవరిపని వారు చూసుకుంటూ గెలుపు కోసం ప్రయత్నిస్తారు. కొందరు మాత్రం పిచ్చి అభిమానంతో హద్దులు దాటుతుంటారు. నిజమైన అభిమానులైతే ఈ గొడవలను ఆపండి. ఆటగాళ్ల ప్రదర్శనను మాత్రమే టీజ్ చేస్తూ ఆస్వాదించండి. కనీ, ఇతర ఆటగాళ్లతో పోల్చుతూ అభిమానం పేరిట గొడవలకు దిగొద్దు'. అని వీరు సూచించాడు.



S. Srikanth

S. Srikanth

Next Story