Virat Kohli: అరుదైన రికార్డు చేరువలో మాజీ కెప్టన్ విరాట్ కోహ్లీ

Virat Kohli: శ్రీలంకతో జరగబోయే టెస్టు క్రికెట్ తో వందో మ్యాచ్ పూర్తిచేసుకోనున్న కోహ్లీ...

Shireesha
Published on: 2 March 2022 11:13 AM IST
Team India Ex-Captain Virat Kolhi Approaching Rare Record that Completing 100th Test Match | Sports News
X

Virat Kohli: అరుదైన రికార్డు చేరువలో మాజీ కెప్టన్ విరాట్ కోహ్లీ 

Virat Kohli: టీమీండియా క్రికెటర్ , మాజీ కెప్టన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. శ్రీలంక తో జరగబోయే టెస్టు క్రికెట్ తో ఆయన వందో మ్యాచ్ పూర్తి చేయనున్నారు. 2011లో వెస్టిండీస్ తో కింగ్ స్టన్ లో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడాడు. 7,962 పరుగులు చేశాడు.

ఇందులో 27 శతకాలు, 28 అర్ధ శతకాలు ఉన్నాయి. ఆటలో అంకితభావానికి కోహ్లీ నిలువెత్తు నిదర్శనమని టీమీండియా టెస్ట్ సిరీస్ వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పేర్కొన్నారు. ఆటగాడిగా, కెప్టెన్ గా కోహ్లీ టీమిండియాకు చిరస్మరణీయ విజయాలను అందించారు. శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడమే కోహ్లీకి తామిచ్చే బహుమానమని బుమ్రా తెలిపారు.

Shireesha

Shireesha

Next Story