Vinay Shankar Engagement: టీంఇండియా క్రికెటర్ నిశ్చితార్దం..

Vinay Shankar Engagement: టీంఇండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ నిశ్చితార్దం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

S. Srikanth
Published on: 21 Aug 2020 3:37 PM IST
Vinay Shankar Engagement: టీంఇండియా క్రికెటర్ నిశ్చితార్దం..
X

Vinay Shankar Engagement: టీంఇండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ నిశ్చితార్దం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. తనకు కాబోయే భార్య వైశాలి విశ్వేశ్వరన్ తో కలిసి దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంగరం ఇమేజ్ ను జత చేసాడు. దీంతో వినయ్ శంకర్ కు నేటిజేన్లు, అతని సహచరులు కంగ్రాట్స్ విజయ్ శంకర్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.. కాగా, త్వరలో యుఏఈలో జరగనున్న ఐపీఎల్ టోర్నీలో సన్ రైజేర్స్ హైదరాబాద్ తరపున ఆడనున్నాడు.

గత ఏడాది 2019 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి అంబటి రాయుడ్ని పక్కనపెట్టి టీంఇండియా సేలేక్టర్స్ విజయ్ శంకర్‌ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కానీ వారి అంచనాల్ని అందుకోలేకపోయిన శంకర్ గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వెనుదిరిగాడు. అయితే, సెప్టెంబర్ నుండి ఐపీఎల్ టోర్నీ జరగుతుండగా.. వాటిలో అతని సత్తా చాటి మళ్లి టీం ఇండియా జట్టులు స్థానం సంపాదించాలని ఆశిస్తున్నాడు.

వినయ్ శంకర్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 557 పరుగులు చేసాడు.. ఆడింది కేవలం 33 మ్యాచ్ లు అయినప్పటికీ సుమారు 133.89 స్ట్రైక్‌రేట్‌తో ఉన్నాడు. అంతే కాదు వీటిలో రెండు అర్ధ శతకాలు ఉండగా.. బౌలింగ్ లో మాత్రం ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం దక్కడం లేదు. వినయ్ శంకర్ ఇప్పటివరకు కేవలం 10 మ్యాచ్ లలో మాత్రమే అతడికి బౌలింగ్ చేసే అవకాసం దొరికింది. అయితే, తను బౌలింగ్ చేసిన 10 మ్యాచ్ లలో కలిపి మొత్తం 147 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.


View this post on Instagram

💍 PC - @ne_pictures_wedding

A post shared by Vijay Shankar (@vijay_41) on


S. Srikanth

S. Srikanth

Next Story