WTC Finals: డబ్యూటీసీ లో గెలవాలంటే బూమ్రా వికెట్లు తీయాలి: మాజీ సెలక్టర్‌

ఐసీసీ డబ్యూటీసీ పైనల్స్‌ లో ఇండియా విజయం సాధించాలంటే బుమ్రా వికెట్లు తీయాలని మాజీ సెలక్టర్‌ సాబా కరీమ్‌ అన్నాడు.

Venkata Chari
Updated on: 12 May 2021 8:59 PM IST
Team India Chances Will Increase if Jasprit Bumrah Took Wickets
X
బూమ్రా (ఫొటో ట్విట్టర్)

WTC Finals: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పైనల్స్‌ లో ఇండియా విజయం సాధించాలంటే పేస్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా వికెట్లు తీయాలని మాజీ సెలక్టర్‌ సాబా కరీమ్‌ అన్నాడు. అతి తక్కువ టైంలోనే బూమ్రా అంతర్జాతీయ క్రికెట్లో ఎదిగాడని కొనియాడాడు. ఫిట్‌గా ఉండాలన్న ప్రెజర్ బూమ్రాపై ఉంటోందని అభిప్రాయపడ్డాడు.

'ఐపీఎల్‌లో బుమ్రా ఫాం అద్భుతంగా ఉంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ అదే ఫాం కొనసాగిస్తే.. టీం ఇండియా గెలుపు లాంఛనమే అవుతోంది. టీం ఇండియాలో కీలక పేసర్‌ బుమ్రానే. మూడు ఫార్మాట్లలో బూమ్రా ఆడుతున్నాడు. అందుకే అతిపై ఒత్తిడి ఉంటుంది. టెస్టుల్లో అతను గొప్పగానే రాణిస్తుంటాడని' ఆయన అన్నాడు.

'బుమ్రా బౌలింగ్‌లో వేగం ఎక్కువగా ఉంటుంది. చూడచక్కని షార్ట్‌పిచ్‌ బాల్స్ సంధిస్తుంటాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్లో బుమ్రా ఆధిపత్యం పెరుగుతోందని' కరీమ్‌ పేర్కొన్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story