Virat Kohli: చేయాల్సింది చేశాం.. ఇక ఏం జరుగుతుందో చూడాలి

* చేయాల్సింది చేశాం.. ఇక చూడాల్సింది ఉంది అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు.

Sandeep Reddy
Published on: 6 Nov 2021 1:55 PM IST
Team India Captain Virat Kohli Comments on Afghanistan vs New Zealand Match
X

Virat Kohli: చేయాల్సింది చేశాం.. ఇక ఏం జరుగుతుందో చూడాలి

Virat Kohli: చేయాల్సింది చేశాం.. ఇక చూడాల్సింది ఉంది అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపాడు. స్కాట్లాండ్ తో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లి చివరి రెండు మ్యాచ్ లలో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాకిస్తాన్, న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లలో మాత్రం బౌలర్ల ఒత్తిడి వల్లే ఓటమి పాలయ్యమని తెలిపాడు. పాక్, కివీస్ బౌలర్లు మొదట్లోనే తమ వికెట్లు పడగొట్టి బ్యాట్స్ మెన్ లను పరుగులు చేయకుండా కట్టడి చేశారని తెలిపాడు.

స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు రాణించారని, లక్ష్య ఛేదనలో 8-10 ఓవర్లలోపే మ్యాచ్ ని ముగించాలనుకున్నామన్నాడు. ఇక ఈ రోజు మ్యాచ్ గురించి పెద్దగా మాట్లాడాలని అనుకోవట్లేదంటూనే నవంబర్ 7న ఆఫ్ఘన్ - న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం కోసం ఎదురుచూడాల్సిందే తప్ప ఇప్పుడు ఏమి చేయలేమని తెలిపాడు.

ఆ తరువాత నవంబర్ 5న తన పుట్టినరోజు వేడుకలపై స్పందించిన విరాట్ కోహ్లీ.. తాను పుట్టినరోజు సంబరాలు చేసుకునే వయసు దాటిపోయానని చెప్పాడు. నా కుటుంబం పక్కనే ఉంటే చాలని, ప్రస్తుతం బయోబబుల్‌ లాంటి పరిస్థితుల్లో అనుష్క శర్మ, వామికా తనతోనే ఉండటమే నాకు పెద్ద సెలబ్రేషన్ అని కోహ్లీ తెలిపాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story