బ్యాడ్మింటన్ కోర్టులోనే ఆడాలి.. కరోనాతో పోరు ఇంట్లోనే ఉండి చేయాలి.. సింధు అదిరిపోయే వీడియో

బ్యాడ్మింటన్ కోర్టులోనే ఆడాలి.. కరోనాతో పోరు ఇంట్లోనే ఉండి చేయాలి.. సింధు అదిరిపోయే వీడియో
x
PV Sindhu (File Photo)
Highlights

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది.ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ముందుకు వచ్చింది.

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది.ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ముందుకు వచ్చింది. మహమ్మారి వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో క్రీడాకారుల్ని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు షట్లర్ పీవీ సింధుతో ప్రత్యేకంగా మాట్లాడారు. దీంతో సింధు కోవిడ్ కట్టడి కోసం ఓ వీడియో సందేశం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ఈ వీడియోని సింధు తండ్రి పీవీ రమణ తన మొబైల్‌లో చిత్రీకరించడం చేయడం విశేషం. మార్చిలో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు వెళ్ళిన పీవీ సింధు, తిరిగిరాగానే ప్రభుత్వ సూచనల మేరకు 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంది.

కరోనాపై పోరాటానికి సింధు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి రూ.5 లక్షలు చొప్పున విరాళం అందజేశారు. తాజాగా ప్రధాని మోదీ సూచనల మేరకు ఓ వీడియో ద్వారా ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది.ఈ వీడియో చూస్తే బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కోర్టులోనే ఆడాలి.. అప్పుడే గెలుస్తాం. అవునా..? కరోనాతో ఫైట్ చేయాలంటే ఇంట్లోనే ఉండాలి. సామాజిక దూరం పాటిస్తేనే కరోనా మీద మనం విజయం సాధించగలం. సహాయం అందించేందుకు 104 హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. Stay Home Stay Safe అంటూ'' ప్రభుత్వం చెప్తున్న సూచనలు పాటిస్తూ, ఇంట్లోనే ఉందాం కరోనాని కలిసి ఎదుర్కొందాం. అని వీడియోని ముగించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories