T20 WorldCup 2021- Eng vs NZ: నేడు ఇంగ్లాండ్ - కివీస్ మధ్య సెమీస్ పోరు

*నేడు(బుధవారం) అబుధాబి వేదికగా జరగనున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ - ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి

Sandeep Reddy
Published on: 10 Nov 2021 1:21 PM IST
T20 worldcup 2021 England vs New Zealand Semi Final Match Preview Today 10 11 2021 | Cricket News
X

T20 worldcup 2021- Eng vs NZ: నేడు న్యూజిలాండ్ - ఇంగ్లాండ్ మధ్య సెమీస్ పోరు

T20 Worldcup 2021- Eng vs NZ: 2019 ప్రపంచకప్ ఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలయిన కివీస్ ప్రతీకారం తీర్చుకోడానికి సిద్దమైంది. టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా నేడు(బుధవారం) అబుధాబి వేదికగా జరగనున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ - ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా టోర్నమెంట్ నుండి ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ వైదొలగడంతో బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ జట్టుకు గట్టి దెబ్బే తగిలింది. ఇక జాసన్ రాయ్ స్థానంలో సామ్ బిల్లింగ్స్ జట్టులోకి వచ్చాడు.

న్యూజిలాండ్ బ్యాటింగ్ లో గప్టిల్ మంచి ఫామ్ లో ఉండగా బౌల్ట్‌, సౌథీతో పాటు ఆడమ్ మిల్నె, ఇష్ సోధి బౌలింగ్ లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆరంభం నుండి దూకుడుగా ఆడే ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ లకు కివీస్‌ తన బౌలింగ్ తో కట్టడి చేయడానికి సిద్దంగా ఉంది.

మ్యాచ్ వివరాలు:

సెమీ ఫైనల్ 1

ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్

నవంబర్ 10(బుధవారం) 2021

షేక్ జాయద్ స్టేడియం, అబుధాబి

హెడ్ టూ హెడ్:

ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్‌ లో న్యూజిలాండ్ - ఇంగ్లండ్ జట్ల మధ్య 5 మ్యాచులు జరగగా అందులో ఇంగ్లండ్ 3, న్యూజిలాండ్‌ 2 మ్యాచులలో గెలుపొందాయి.

ఇరు జట్ల తుది వివరాలు ఇలా ఉండే అవకాశాలున్నాయి..

ఇంగ్లాండ్ జట్టు:

జోస్ బట్లర్ (WK), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, మోయిన్ అలీ, ఇయాన్ మోర్గాన్ (c), సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్

న్యూజిలాండ్ జట్టు:

మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (c), డెవాన్ కాన్వే (WK), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్

Sandeep Reddy

Sandeep Reddy

Next Story