IND vs PAK: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పాక్‌తో మ్యాచ్ జరిగే ఛాన్స్ లేదంట.. కారణం ఏంటంటే?

న్యూయార్క్ వేదికగా దాయాదుల మధ్య పోరు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 8 Jun 2024 8:30 PM IST
T20 World Cup Match Between India and Pakistan Tomorrow
X

IND vs PAK: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పాక్‌తో మ్యాచ్ జరిగే ఛాన్స్ లేదంట.. కారణం ఏంటంటే?

IND VS PAK: క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. మ్యాచ్ వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

పాకిస్థాన్‌తో జరిగే ఈ మ్యాచ్‌కు ముందు టీంఇండియా పూర్తిగా సిద్ధం అయినట్లు కనిపిస్తోంది. టోర్నమెంట్‌లో భారత జట్టు విజయంతో ప్రారంభించగా... పాకిస్థాన్ అమెరికా చేతిలో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌పై పాక్ జట్టు గెలవాలని చూస్తోంది. మరోవైపు టీం ఇండియా సైతం రెండో విక్టరీ సాధించాలని భావిస్తోంది. అయితే మ్యాచ్‌కి వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఇది ఇరు జట్ల అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story