AUS vs ZIM: ప్రపంచ కప్‌లో తొలి సంచలనం.. ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన జింబాబ్వే!

AUS vs ZIM: టీ20 ప్రపంచ కప్ 2026లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును పసికూన జింబాబ్వే మట్టికరిపించి టోర్నీలో తొలి సంచలనాన్ని నమోదు చేసింది.

Arun Chilukuri
Published on: 13 Feb 2026 2:55 PM IST
AUS vs ZIM: ప్రపంచ కప్‌లో తొలి సంచలనం.. ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించిన జింబాబ్వే!
X

AUS vs ZIM: టీ20 ప్రపంచ కప్ 2026లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును పసికూన జింబాబ్వే మట్టికరిపించి టోర్నీలో తొలి సంచలనాన్ని నమోదు చేసింది. కొలంబో వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆసీస్‌పై జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది.

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు జింబాబ్వే బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా బ్లెస్సింగ్ ముజర్బానీ (4/17) తన నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆసీస్ వెన్ను విరిచాడు. ఓవైపు మాట్ రెన్‌షా (65) అర్ధ సెంచరీతో పోరాడినప్పటికీ, అతడికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. దీంతో ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటై ఓటమి చవిచూసింది.

జింబాబ్వే బౌలర్‌ ముజర్బానీ (4/17) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతడితోపాటు బ్రాడ్ ఇవాన్స్ 3.. మసకద్జ, బర్ల్ చెరో వికెట్ తీశారు. ఈ చారిత్రాత్మక విజయంతో జింబాబ్వే పాయింట్ల పట్టికలో తన ఖాతా తెరవడమే కాకుండా, పెద్ద జట్లకు హెచ్చరికలు పంపింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story