India vs Pakistan: భారత్, పాక్ మ్యాచ్‌కు పొంచిఉన్న వాన గండం

India vs Pakistan: ఆక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా మ్యాచ్.. వర్షసూచన వెలువరించిన ఆస్ట్రేలియా వాతావరణ శాఖ పేర్కొంది

Jyothi
Published on: 21 Oct 2022 7:52 AM IST
T20 World Cup 2022 India vs Pakistan Rain Forecast Melbourne Weather Report On 23 October
X

India vs Pakistan: భారత్, పాక్ మ్యాచ్‌కు పొంచిఉన్న వాన గండం

India vs Pakistan: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులకు పండగే. గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడని ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌ లో దాయాదుల సమరం జరగనుండడంతో, ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని క్రికెట్ ప్రేమికులు తహతహలాడుతున్నారు. ఇక భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశముంది. ఆదివారం మెల్బోర్న్‌లో వర్షం పడుతుందని అక్కడి వాతావరణశాఖ వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, వర్షం కురిసేందుకు దాదాపు 95 శాతం అవకాశాలున్నాయని పేర్కొంది. ముఖ్యంగా, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో వర్షం కురవొచ్చని వివరించింది. 4 నుంచి 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు ఆస్ట్రేలియా వాతావరణ శాఖ పేర్కొంది.

Jyothi

Jyothi

Next Story