WI vs SA: తడబడిన వెస్టిండిస్.. గెలుపు దిశగా దక్షిణాఫ్రికా

* వెస్టిండిస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది. * దక్షిణాఫ్రికా : 47/1 (7 ఓవర్లు)

Sandeep Reddy
Published on: 26 Oct 2021 6:05 PM IST
T20 World Cup 2021 West Indies vs South Africa Match In Dubai Cricket Stadium Today 26 10 2021
X

West Indies vs South Africa: అక్టోబర్ 26న మంగళవారం రోజున దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వెస్టిండిస్ - దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండిస్ జట్టులో ఓపెనర్లు 73 పరుగుల శుభారంభాన్ని ఇచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లు తక్కువ పరుగులకే ఔటై పెవిలియన్ చేరడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది.

వెస్టిండిస్ ఆటగాళ్ళలో లెవీస్ (56) అర్ధసెంచరీ, పోలార్డ్ (26) పరుగులు మినహా ఎవరు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. చివరి 16 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తక్కువ పరుగులే చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్స్ లో ప్రిటోరియాస్ మూడు వికెట్లను, మహారాజ్ రెండు వికెట్లను, రబడ, నోర్త్జే లు తలో వికెట్ పడగొట్టారు.

ఇక 144 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ టెంబా బావుమా 2 పరుగులకే అవుట్ అవగా, డెర్ డస్సెన్ హెండ్రిక్స్ క్రీజులో ఉన్నారు.

వెస్టిండిస్ : 143 / 8 (20 ఓవర్లు)

లెవీస్ (56)

పోలార్డ్ (26)

దక్షిణాఫ్రికా : 47/1 (7 ఓవర్లు)

డెర్ డస్సెన్ 32

హెండ్రిక్స్ 12

Sandeep Reddy

Sandeep Reddy

Next Story