England vs Bangladesh: టీ20 చరిత్రలో తొలిసారి తలపడనున్న బంగ్లాదేశ్ - ఇంగ్లాండ్

Sandeep Reddy
Published on: 27 Oct 2021 12:59 PM IST
T20 World Cup 2021 - Today England Vs Bangladesh Match Preview 27th October 2021
X

England vs Bangladesh: టీ20 చరిత్రలో తొలిసారి తలపడనున్న బంగ్లాదేశ్ - ఇంగ్లాండ్

T20 World Cup 2021 - England vs Bangladesh: టీ20 ప్రపంచకప్ లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్ - ఇంగ్లాండ్ మధ్య అబుదాభిలోని షేక్ జాయద్ స్టేడియం వేదికగా గ్రూప్ 1 లీగ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు టీ20 లలో తలపడని బంగ్లాదేశ్ - ఇంగ్లాండ్ జట్లు తొలిసారిగా ఈ మ్యాచ్ లో పోటీపడటం విశేషం. ఇప్పటికే వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో ఘనవిజయం సాధించి మంచి ఊపుమీదున్న ఇంగ్లాండ్ జట్టు బంగ్లాపై మ్యాచ్ లోనూ విజయం సాధింఛి గ్రూప్ 1 లో మొదటి స్థానంలో నిలవాలని తహతహలాడుతుంది.

ఈ మ్యాచ్ విజయంతో ఇంగ్లాండ్ జట్టు దాదాపుగా సెమీ ఫైనల్ అవకాశాలను కూడా పదిలం చేసుకోనుంది. మరోపక్క బంగ్లాదేశ్ ఆటగాళ్ళు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో రాణించి మంచి స్కోర్ సాధించిన శ్రీలంక బ్యాటింగ్ దాటికి నిర్ణిత లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమి చవిచూసింది. ఇప్పటికే గ్రూప్ 1 లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక ఒక్కో విజయంతో పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచాయి. ఇక బుధవారం జరగనున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ - ఇంగ్లాండ్ జట్ల తుది వివరాలు ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇంగ్లాండ్ జట్టు:

జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్

బంగ్లాదేశ్ జట్టు:

మహ్మద్ నయీమ్, లిటన్ దాస్/సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అఫీఫ్ హుస్సేన్, నూరుల్ హసన్, మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్

Sandeep Reddy

Sandeep Reddy

Next Story