T20 World Cup 2021: వెస్టిండీస్ తో హోరాహోరి పోరుకు సిద్దమైన ఇంగ్లండ్‌

* యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా శనివారం(అక్టోబర్ 23)న వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌తో తలపడనుంది.

Sandeep Reddy
Published on: 23 Oct 2021 3:05 PM IST
T20 World Cup 2021 Starts West Indies vs England T20 Match Today 23 10 2021
X

T20 World Cup 2021: వెస్టిండీస్ తో హోరాహోరి పోరుకు సిద్దమైన ఇంగ్లండ్‌

West Indies vs England: యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా శనివారం(అక్టోబర్ 23) సాయంత్రం 7.30 కు జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌, రన్నరప్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. 2016 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో చివరి ఓవర్లో వెస్టిండీస్ ఆటగాడు బ్రాత్‌వైట్‌ విధ్వంసకర బ్యాటింగ్ తో టైటిల్‌ను గెలుచుకోలేకపోయిన ఇంగ్లండ్..ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

ఇప్పటికే రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ టైటిల్ ని గెలుపొందిన విండీస్‌ ఈ ఏడాది కూడా తమ సత్తాచాటి ముచ్చటగా మూడో సారి టైటిల్‌ ని కైవసం చేసుకోవాలని చూస్తుంది. మరోవైపు రెండోసారి ఈ కప్పును సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఇంగ్లాండ్ జట్టు ఉంది. ఒకవైపు వెస్టిండీస్‌ జట్టులో ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చే భారీ హిట్టర్లు ఉండగా, ఇంగ్లాండ్ జట్టు కూడా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ తో కనిపిస్తుంది.

ఇక ఇయాన్ మోర్గాన్ కోసం టీ20 ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడైన డేవిడ్ మలన్ ని ఇంగ్లాండ్ జట్టు పక్కనపెట్టనుంది. ఇప్పటివరకు జరిగిన 18 టీ20 మ్యాచ్ లలో ఇంగ్లాండ్ జట్టుపై వెస్టిండీస్ 11 మ్యాచ్ లలో నెగ్గింది. ఇక ఈరోజు ఇరు జట్ల తుది జాబితా ఇలా ఉండనుంది..

ఇంగ్లండ్‌ జట్టు:

జాసన్ రాయ్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్

వెస్టిండీస్ జట్టు:

ఎవిన్ లూయిస్, లెండెల్ సిమన్స్, క్రిస్ గేల్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మైర్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రావో, హేడెన్ వాల్ష్, ఓబెడ్ మెక్కాయ్

Sandeep Reddy

Sandeep Reddy

Next Story