T20 World Cup 2021 - SA Vs SL: దక్షిణాఫ్రికా - శ్రీలంక మధ్య నేడు కీలక మ్యాచ్

* తిరిగి దక్షిణాఫ్రికా జట్టులోకి డికాక్ *అసలంక పైనే లంక ఆశలు

Sandeep Reddy
Published on: 30 Oct 2021 1:33 PM IST
T20 World Cup 2021 South Africa Vs Sri Lanka Match Preview Today 30th October 2021 - Cricket News
X

T20 World Cup 2021 - SA Vs SL: దక్షిణాఫ్రికా - శ్రీలంక మధ్య నేడు కీలక మ్యాచ్

T20 World Cup 2021 - South Africa Vs Sri Lanka: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా అక్టోబర్ 30 మధ్యాహ్నం 3.30 నిమిషాలకు షార్జా వేదికగా శ్రీలంక - దక్షిణాఫ్రికా మధ్య రసవత్తర మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే గ్రూప్ 1 లో వరుస విజయాలతో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మొదటి, రెండు స్థానాల్లో ఉండగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఆడిన రెండు మ్యాచ్ లలో ఒక విజయంతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి సెమీఫైనల్ లో స్థానం కోసం పోటీపడుతున్నాయి.

దీంతో ఈరోజు జరగనున్న మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇక బ్లాక్ లైవ్ మ్యాటర్ లో క్షమాపణ చెప్పిన డికాక్ నేటి మ్యాచ్ లో తుదిజట్టులో స్థానం పొందాడు. మరోపక్క శ్రీలంక జట్టు యువ ఆటగాడు అసలంక, కుశాల్ పెరేరాల బ్యాటింగ్ పైనే ఆశలు పెట్టుకుంది.

మ్యాచ్ వివరాలు:

దక్షిణాఫ్రికా - శ్రీలంక

అక్టోబర్ 30 (శనివారం) 2021

మధ్యాహ్నం 3.30 నిమిషాలు

షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా

హెడ్ టూ హెడ్

ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్ లు జరగగా దక్షిణాఫ్రికా 11, శ్రీలంక 5 మ్యాచ్ లలో విజయం సాధించింది. ప్రపంచకప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లలో దక్షిణాఫ్రికా 2-1 తో శ్రీలంకపై ఆధిక్యంలో ఉంది.

తుది జట్టు వివరాలు ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి..

దక్షిణాఫ్రికా జట్టు:

టెంబా బావుమా (c), క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, రీజా హెండ్రిక్స్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ

శ్రీలంక జట్టు:

పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్సే, వనిందు హసరంగా డిసిల్వా, దసున్ షనక (c), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లహిరు కుమార, మహేశ్ తీక్షణ

Sandeep Reddy

Sandeep Reddy

Next Story