T20 World Cup 2021: నేడు పాకిస్తాన్ - ఆస్ట్రేలియా మధ్య సెమీస్ పోరు

T20 World Cup 2021 - Pakistan Vs Australia: నేడు పాకిస్తాన్ - ఆస్ట్రేలియా మధ్య సెమీస్ పోరు
*టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా నేడు దుబాయ్ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్తాన్ - ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి.
Pakistan Vs Australia: టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా నేడు(నవంబర్ 11) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్తాన్ - ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే బుధవారం న్యూజిలాండ్ - ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించి ఫైనల్ కి చేరగా నేడు జరగనున్న మ్యాచ్ లో గెలిచి ఫైనల్ ఏ జట్టు ఫైనల్ కి చేరుతుంద అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే గ్రూప్ 2 టేబుల్ లో జరిగిన 5 మ్యాచ్ లలోనూ విజయం సాధించి మంచి ఊపు మీదున్న పాకిస్తాన్ జట్టు ఆసీస్ పై గెలిచి ఎలాగైనా ఫైనల్ చేరాలని తహతహలాడుతుంది. అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో బలంగా ఉన్న పాక్ జట్టు ఆసీస్ జట్టును ఏ విధంగా ఎదుర్కుంటుందో నేడు తేలనుంది.
ఆస్ట్రేలియా జట్టులో ఫించ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్ జట్టుకు అవసరమైన సమయంలో తమ వంతు పరుగులను అందించడంతో పాటు కమిన్స్, స్టార్క్ తమ బౌలింగ్ తో ప్రత్యర్ధి బ్యాట్స్ మెన్ లను కట్టడి చేయగలడంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఇక దుబాయ్ స్టేడియంలో ఇప్పటి వరకు మంచు ప్రభావం కీలకంగా మారడంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
మ్యాచ్ వివరాలు:
పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా
నవంబర్ 11 (గురువారం)2021
రాత్రి 7.30 నిమిషాలకు
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్
హెడ్ టూ హెడ్:
ఇప్పటివరకు పాకిస్తాన్ - ఆస్ట్రేలియా 22 మ్యాచులలో తలపడగా పాకిస్తాన్ 13, ఆస్ట్రేలియా 9 మ్యాచ్ లలో గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్ లో 6 మ్యాచ్ లలో పోటీపడగా పాకిస్తాన్ 3, ఆస్ట్రేలియా 3 మ్యాచ్ లలో విజయం సాధించింది.
పాకిస్తాన్ జట్టు:
ముహమ్మద్ రిజ్వనా, బాబర్ అజామ్(సి), ఫఖర్ జమాన్, ముహమ్మద్ హఫీజ్, షాయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రయూఫ్, షాహీన్ షా ఫరీది
ఆస్ట్రేలియా జట్టు:
డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT