T20 World Cup 2021 - India Vs Namibia: నేడు నమీబియాతో తలపడనున్న భారత్

T20 World Cup 2021 India Vs Namibia Match Preview Today 8th November 2021 - Cricket News
x

T20 World Cup 2021 - India Vs Namibia: నమీబియాతో తలపడనున్న భారత్

Highlights

* నేడు దుబాయ్ వేదికగా భారత్ - నమీబియా మధ్య నామమాత్రపు మ్యాచ్

T20 World Cup 2021 - India Vs Namibia: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా నవంబర్ 8 న (సోమవారం) భారత్ - నమీబియా జట్లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పోటీపడనున్నాయి. సెమీస్ చేరడానికి నిన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ గెలుపుపై ఆశలు పెట్టుకున్న టీమిండియా.. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘన్ ఓటమితో సెమీస్ చేరలేకపోయింది. ఇక నేడు జరగనున్న నామమాత్రపు మ్యాచ్ తరువాత టీమిండియా ఇంటి ముఖం పట్టనుంది.

పాకిస్తాన్, న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లలో ఓటమి పాలయిన భారత జట్టు.. ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్ పై ఘనవిజయం సాధించి నేడు నమీబియాతో మ్యాచ్ కి సిద్దమైంది. టీ20 ప్రపంచకప్ 2021 లో గ్రూప్ 1 నుండి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా.. గ్రూప్ 2 నుండి పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ కి చేరాయి.

మ్యాచ్ వివరాలు:

భారత్ - నమీబియా

నవంబర్ 8 (సోమవారం) 2021

రాత్రి 7.30 నిమిషాలు

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

హెడ్ టూ హెడ్:

నేటి మ్యాచ్ తో మొదటిసారి టీ20 మ్యాచ్ లో భారత్ - నమీబియా తలపడబోతున్నాయి. 2003 ప్రపంచకప్ లో భాగంగా 50 ఓవర్ల మ్యాచ్ లో ఇరు జట్లు తలపడగా భారత్ విజయం సాధించింది.

తుది జట్టు వివరాలు ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి..

భారత జట్టు:

రోహిత్ శర్మ, రాహుల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ (సి), రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి/రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ

నమీబియా జట్టు:

స్టీఫెన్ బార్డ్, మైఖేల్ వాన్ లింగెన్, క్రెయిగ్ విలియమ్స్, గెర్హార్డ్ ఎరాస్మస్ (సి), డేవిడ్ వైస్, JJ స్మిత్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, జేన్ గ్రీన్ , జాన్ ఫ్రైలింక్, బెర్నార్డ్ స్కోల్ట్జ్

Show Full Article
Print Article
Next Story
More Stories