T20 World Cup 2021: తొలి మ్యాచులో చేతులెత్తేసిన కరీబియన్ జట్టు

T20 World Cup 2021 - England vs West Indies Highlights: తొలి మ్యాచులో చేతులెత్తేసిన కరీబియన్ జట్టు...

Shireesha
Updated on: 24 Oct 2021 11:14 AM IST
T20 World Cup 2021 England vs West Indies Match Highlights | Cricket News
X

T20 World Cup 2021: ఇంగ్లండ్‌తో మ్యాచులో 55 పరుగులకే ఆలౌట్

T20 World Cup 2021 - England vs West Indies Highlights: టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ చెత్త రికార్డును నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్‌ 55 పరుగులకే ఆలౌట్‌ అయి టి20 ప్రపంచకప్‌లో మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు.. 55 పరుగులకే కుప్పకూలింది.

ఐదు ఓవర్లలోపే మూడు వికెట్లు కోల్పోగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. హిట్టర్లు కూడా చేతులెత్తేయడంతో అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 8.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 4 ఓవర్లలో 2 వికెట్లు తీసిన మొయిన్ అలీ మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.

Shireesha

Shireesha

Next Story