T20 World Cup 2021 - Aus Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్

T20 World Cup 2021 Australia Vs West Indies Match Preview Today 6th November 2021 - Cricket News
x
Highlights

* వెస్టిండిస్ జట్టుతో కీలక మ్యాచ్ లో తలపడనున్న ఆసీస్

Australia Vs West Indies: నేడు నవంబర్ 6న ఆస్ట్రేలియా - వెస్టిండిస్ మధ్య అబుధాబి వేదికగా కీలక మ్యాచ్ మొదలుకానుంది. తాజాగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్ ఆశలు వదులుకున్న వెస్టిండిస్ జట్టుకు ఇది నామమాత్రపు మ్యాచ్ అయిన ఆస్ట్రేలియా జట్టుకు మాత్రం గెలుపు తప్పనిసరి. అయితే ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పబోతున్న బ్రేవోకి మాత్రం విజయంతో ఘనంగా వీడ్కోలు పలకాలని విండీస్ ఆటగాళ్ళు ఎదురుచూస్తున్నారు.

గ్రూప్ 1 నుండి సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించిన, ఆ తరువాత దక్షిణాఫ్రికా - ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ పూర్తయ్యే వరకు ఎవరు సెమీస్ వెళ్తారో మాత్రం తెలియని పరిస్థితి. ఒకవేళ ఇటు ఆసీస్, అటు దక్షిణాఫ్రికా ఇరు జట్లు గెలిస్తే నెట్ రన్ రేట్ తో ఫలితం తేలనుంది.

మ్యాచ్ వివరాలు:

ఆస్ట్రేలియా vs వెస్టిండిస్

నవంబర్ 6(శనివారం)2021

మధ్యాహ్నం 3.30 నిమిషాలకు

షేక్ జాయద్ క్రికెట్ స్టేడియం, అబుధాబి

హెడ్ టూ హెడ్:

ఇప్పటివరకు ఆస్ట్రేలియా vs వెస్టిండిస్ 16 మ్యాచులలో తలపడగా ఆస్ట్రేలియా 6 మ్యాచ్ లలో, వెస్టిండిస్ 10 మ్యాచ్ లలో గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్ లో అయిదు సార్లు పోటీపడగా మూడు సార్లు వెస్టిండిస్, రెండు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించాయి.

ఆస్ట్రేలియా జట్టు:

డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(సి), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్(w), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

వెస్టిండిస్ జట్టు:

క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, నికోలస్ పూరన్(w), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, కీరన్ పొలార్డ్(c), ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, డ్వేన్ బ్రావో, హేడెన్ వాల్ష్, అకేల్ హోసేన్

Show Full Article
Print Article
Next Story
More Stories