T20 World Cup 2024: నేడే హైవోల్టేజ్ మ్యాచ్..! గెట్ రెడీ ఫ్యాన్స్

T20 match between India and Pakistan
x

T20 World Cup 2024: నేడే హైవోల్టేజ్ మ్యాచ్..! గెట్ రెడీ ఫ్యాన్స్

Highlights

న్యూయార్క్‌ వేదికగా భారత్‌-పాక్‌ మధ్య టీ20 మ్యాచ్‌

దాయాదుల పోరు.. ఈ మాట వినగానే గుర్తొచ్చేది ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్. క్రికెట్ ప్రపంచంలో జరిగేది ఏ టోర్నీ అయినా.. అక్కడ ఇండియా, పాక్ మధ్య మ్యా్చ్ అంటే వచ్చే ఊపే వేరు. చరిత్రలో ఆ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ అదో లెవల్. భారత, పాక్ అభిమానులే కాదు.. ప్రపంచంలో ప్రతీ క్రీడాభిమాని దాయాదుల పోరంటే టీవీలకు అతుక్కుపోవాల్సిందే. అలాంటి సమరానికి మరోసారి సమయం ఆసన్నమైంది. USA వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా రేపు భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి.

వరల్డ్ క్లాస్ బ్యాటింగ్.. పవర్ హిట్టింగ్.. యంగ్ డైనమిక్స్ తో హిట్ మ్యాన్ నేతృత్వంలో టీమిండియా.. బాబర్ ఆజామ్, రిజ్వాన్, అమిర్ లాంటి అనుభవజ్ఞులైన టీమ్ తో పాకిస్థాన్ రేపటి మ్యాచ్ లో బరిలోకి దిగుతున్నాయి. ప్రతీ ఐసీసీ టోర్నీలో పాక్ పై ఆధిపత్యం చెలాయించే భారత జట్టుకు ఇది రివేంజ్ తీర్చుకునే మ్యాచ్. గత టీ20 వరల్డ్ కప్ లో పాక్ వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేసి భారత్ పై విజయం సాధించింది. ఇప్పుడు ఆ మ్యాచ్ కు ప్రతీకారం తీర్చుకునే రోజు వచ్చిందని భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టీమ్ ల విషయానికొస్తే టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా హార్దిక్ వైస్ కెప్టెన్. విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, పంత్, సంజు శాంసన్, శివం దూబె, యశస్వి జైశ్వాల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్, చాహల్, అర్షదీప్ సింగ్ స్క్వాడ్ లో ఉన్నారు. అయితే రేపటి మ్యాచ్ కు కోహ్లి ఓపెనర్ గా వచ్చే అవకాశాలు ఉండటంతో జైశ్వాల్ బెంచ్ కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక హార్దిక్, జడేజా, శివం దూబేల్లో ఆల్ రౌండ్ స్థానంలో ఏ ఇద్దరిని తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. ఇక బౌలింగ్ లో సిరాజ్, బుమ్రా కీలకం కావడంతో.. అర్ష్ దీప్, కుల్దీప్ యాదవ్ ను అవసరాన్ని బట్టి ఆడించే అవకాశాలు మాత్రమే ఉన్నాయి.

బాబర్ ఆజామ్ కెప్టెన్సీలో మరోసారి ఐసీసీ టోర్నీలో బరిలోకి దిగుతోంది పాకిస్థాన్. ఈ జట్టులో ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ రిజ్వాన్, ఫఖర్ జమాన్ తో బ్యాటింగ్ బలంగా ఉంది. ముగ్గురు ఆల్ రౌండర్లు షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసీం, ఇఫ్తికర్ అహ్మద్ లను ఎంపిక చేసింది పాక్ జట్టు.. ఆమిర్, షాహిన్ ఆఫ్రిది, హరీస్ రవూఫ్ లాంటి సీనియర్లతో పాటు నసీమ్ షా, ఆబ్రార్ అహ్మద్ లతో పాక్ బౌలింగ్ పటిష్టంగా ఉంది.

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. భారత జట్టుకు అతనో బలం. అతనే నమ్మకం.. పవర్ హిట్టింగ్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే రోహిత్ శర్మపై ఈ సారి భారీ అంచనాలున్నాయి. ఐపీఎల్ లో రోహిత్ ఫెయిల్ అయినా.. ఐసీసీ టోర్నీల్లో ఈ హిట్ మ్యాన్ ఆటతీరు వేరు. ఒంటిచేత్తో మ్యాచ్ గతిని మార్చే రోహిత్ క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థికి దడే. ఇప్పటివరకు 152 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 4 వేల 26 పరుగులు చేశాడు.

ఇక విరాట్ కోహ్లీ విషయానికొస్తే అతని పరుగుల దాహం తీరనిది.. ప్రత్యర్థి భారత జట్టును శాసించాలంటే.. ముందు విరాట్ వికెట్ సాధించాలి. అలా ఉంటుంది కోహ్లీ ఆట. ఒక్కసారి స్టాండ్ అయితే వార్ వన్ సైడ్ అంటూ దూసుకెళ్లే కోహ్లీ ఈ టోర్నీలో ఓపెనర్ గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యశస్వికి బదులుగా ఇదే కంటిన్యూ చేస్తే ఇండియా టీమ్ పవర్ ప్లేలో పరుగుల సునామీ సృష్టించడం ఖాయం. ఇప్పటివరకు 118 మ్యాచులు ఆడిన కోహ్లి.. 4వేల రన్స్ చేశాడు. 37 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. పాకిస్థాన్ పైనా ఏ బ్యాట్స్ మెన్ కు లేని ట్రాక్ రికార్డ్ కోహ్లీ సొంతం. ఇప్పటివరకు ఏ ప్లేయర్ టీ20ల్లో పాక్ పై 2వందలకు పైగా స్కోరు చేయలేదు. గత ఐదు మ్యాచుల్లో కోహ్లీ పాక్ పై నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు.

భారత జట్టులో మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్.. అటాకింగ్ తో పాటు క్లాస్ ప్లేతో ఆకట్టుకునే ఈ యువకెరటం ఇప్పటివరకు ఆడింది 17 టీ20 మ్యాచులు. 502 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో కూడా జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. అయితే ఓపెనింగ్ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ తో రేపటి మ్యా్చ్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనే అనుమానాలున్నాయి. ఒకవేళ కోహ్లీ వన్ డౌన్, యశస్వి ఓపెనింగ్ లో ఆడితే భారత్ టాప్ ఆర్డర్ పటిష్టంగా మారిన్నట్టే.

ఇండియన్ 360 డిగ్రీ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ మరో కీ ప్లేయర్. ఆకాశమే హద్దుగా చెలరేగే సూర్యకుమార్ పై ఈసారి భారత అభిమానులకు అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటివరకు 61 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడిన స్కై... 2వేల 143 రన్స్ చేశాడు. ఇందులో 17 హాఫ్ సెంచరీలు కాగా...4 సెంచరీలు. ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ నెంబర్ వన్ గా ఉన్న సూర్య టీమిండియా మిడిలార్డర్ కు అదనపు బలం. ఐపీఎల్ సీజన్ లో రాణించని సూర్య.. టీ20 వరల్డ్ కప్ లో చెలరేగుతాడని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

ఆల్ రౌండర్ల విషయానికొస్తే భారత జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలకంగా మారే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు 93 టీ20 మ్యాచులు ఆడిన హార్దిక్ 13 వందల 48 పరుగులు చేశాడు. 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. 76 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల మ్యాచుల్లో బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తున్న హార్దిక్ బ్యాటింగ్ లో కూడా తిరిగి ఫామ్ సాధిస్తే.. ఆల్ రౌండ్ షో నడవడం పక్కా.

ఐపీఎల్ తో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ పైనా ఆశలు పెట్టుకుంది టీమిండియా. కోహ్లీ ఓపెనింగ్ వస్తే పంత్ ను థర్డ్ ప్లేస్ లో ఆడించేందుకు టీమిండియా ఆలోచిస్తోంది. అదే జరిగితే రిషబ్ పంత్ బ్యాటింగ్ కూడా టీమిండియా టాపార్డర్ లో కీలకం. రోడ్డు ప్రమాదంతో ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు దూరమైన పంత్.. ఐపీఎల్ లో అంచనాలకు మించే రాణించాడు. ఆ పర్ఫార్మెన్స్ తోనే వరల్డ్ కప్ స్క్వాడ్ లో చోటు దక్కించుకున్న పంత్.. అదే స్థాయిలో ప్రదర్శన చూపిస్తాడనే ఆశలు పెట్టుకున్నారు టీమిండియా అభిమానులు. ఇప్పటివరకు 67 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడిన పంత్.. 126 స్ట్రైక్ రేట్ తో వెయ్యి పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు.

బౌలింగ్ విభాగానికి వస్తే జస్పీత్ బుమ్రాదే కీ రోల్. టీమ్ లో మెయిన్ బౌలర్ గా బుమ్రాకు అనుభవం ఉంది. యార్కర్, స్లో డెలివరీ, స్వింగ్.. ఇలా ఏ బాల్ అయినా ఈజీగా వేసి బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టించగల బౌలర్ బుమ్రా. 63 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడిన బుమ్రా.. 76 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్ పై ఇప్పటివరకు బుమ్రాకు చెప్పుకోదగ్గ ప్రదర్శన లేదు. 3 మ్యాచుల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే ప్రస్తుతం టోర్నీ జరుగుతున్న యూఎస్ ఏలో బౌలింగ్ కే అనుకూలిస్తుండటం బుమ్రాకు ప్లస్ పాయింట్. బుమ్రా ఈ టోర్నీలో చెలరేగితే భారత్ దాదాపు గట్టెక్కినట్టే..

పాకిస్థాన్ టీమ్ కు వస్తే టీమ్ మొత్తానికి ఓపెనర్లే ప్రధాన బలం. కెప్టెన్ బాబర్ ఆజామ్ ఆ టీమ్ తరపున టీ20ల్లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్. ఇండియా, పాక్ మధ్య జరిగిన చివరి టీ20లో బాబర్ షోతో ఈజీగా ఆ జట్టు విజయం అందుకుంది. క్లాస్ తో పాటు పవర్ హిట్టింగ్ తో చెలరేగే బాబర్ ఆజామ్ పైనే పాక్ ఆశలు. ఇప్పటివరకు 120 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచులు ‎ఆడిన ఆజామ్.. 129 స్ట్రైక్ రేట్ తో 4 వేల పరుగులు చేశాడు. 36 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు నమోదు చేశాడు. బాబర్ ఆజామ్ వికెట్ దక్కించుకుంటే పాక్ పతనాన్ని శాసించడం సులువుగా మారుతుంది.

ఇక మరో ఓపెనర్ రిజ్వాన్, కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ రాణించే రిజ్వాన్.. పాక్ ఓపెనింగ్ కు బలం. బాబర్ తో ఓపెనింగ్ చేసే రిజ్వాన్ తన ప్రదర్శనతో ఎన్నో విజయాలు అందించాడు. 2021 వరల్డ్ కప్ లో టీమిండియాపై 55 బాల్స్ లో 79 రన్స్ తో విధ్వంసం చూపించాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ప్రపంచంలోనే అత్యుత్తమైన టీమ్ లపై రిజ్వాన్ కు మంచి రికార్డ్ ఉంది. ఇప్పటివరకు 99 టీ20 మ్యాచులు ఆడిన రిజ్వాన్, 3 వేల 2 వందల పరుగులు సాధించాడు. 28 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories