ఓ గొప్ప పనికి శ్రీకారం చుడుతున్న రైనా!

ఓ గొప్ప పనికి శ్రీకారం చుడుతున్న రైనా!
x
Highlights

నా పుట్టిన రోజు సందర్బంగా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. చదువుకునే ప్రతి ఒక్కరికి పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు అనేవి తప్పనిసరి సదుపాయాలు. వీటిని యువా అన్‌స్టాపబుల్‌ సహకారంతో గ్రేసియా రైనా ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నాం.

టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఈ శుక్రవారం (నవంబర్ 27)తో రైనాకు 34 ఏళ్లు నిండుతాయి. అయితే తన పుట్టినరోజు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌, జమ్మూ‌, ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లోని దాదాపుగా 34 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. తన కూతురు పేరు మీదగా ఏర్పాటు చేసిన గ్రేసియా రైనా ఫౌండేషన్‌తో ఈ సేవలు అందించనున్నట్లు రైనా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, బాలురు, బాలికలకు వేరువేరుగా మరుగుదొడ్లు నిర్మించడం, స్మార్ట్‌ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నామని సురేష్ రైనా తెలిపాడు.

ఈ సందర్బంగా సురేష్ రైనా మాట్లాడుతూ.. " నా పుట్టిన రోజు సందర్బంగా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. చదువుకునే ప్రతి ఒక్కరికి పాఠశాలల్లో మంచినీరు, మరుగుదొడ్లు అనేవి తప్పనిసరి సదుపాయాలు. వీటిని యువా అన్‌స్టాపబుల్‌ సహకారంతో గ్రేసియా రైనా ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నాం. మేము చేసే ఈ సహాయం వల్ల ఎన్నో వేల మంది విద్యార్థులకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇది మా ఆరంభం మాత్రమే.. భవిష్యత్తుల్లో మరిన్ని పాఠశాలలకు ఇలాంటి సహాయాన్ని అందిస్తాం.. ఇది మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది" అని సురేష్ రైనా పేర్కొన్నాడు.

ఇక అటు లెఫ్ట్ అండ్ బాట్స్ మెన్ గా టీంఇండియా జట్టుకు ఎన్నో విజయాలను అందించిన రైనా, ఈ ఏడాది ఆగస్టు 15న రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి అందరికి తెలిసిందే.



Show Full Article
Print Article
Next Story
More Stories