టీమిండియా మహిళల జట్టును వరించిన సూపర్ విజయం

* సూపర్ ఓవర్లో ఇండియా 20 పరుగుల, ఆస్ట్రేలియా 16 పరుగులు

R Tripura Malini
Published on: 12 Dec 2022 7:34 AM IST
Super Win For Team India Women Team
X

టీమిండియా మహిళల జట్టును వరించిన సూపర్ విజయం

Team India: టీమిండియా మహిళల జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతంచేసుకుంది. ముంబై వేదికగా జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన టీమిండియా మహిళల జట్టు సూపర్ ఓవర్ లో విజయబావుటా ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు సాధించింది. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 187 పరుగులు చేసింది. ఇరుజట్ల స్కోరు సమంకావడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 20 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు 16 పరుగులు చేసింది. దీంతో భారత మహిళల జట్టు సూపర్ విజయాన్ని చేజిక్కించుకుంది. అద్భుతమైన ఆటతీరుతో వ్యక్తిగత అత్యధిక పరుగులతో స్మృతి మందానా టాప్ స్కోరర్‌గా నిలిచింది. 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 79 పరుగులు చేసిన స్మృతిమందాన, సూపర్ ఓవర్లోనూ ఒక సిక్సర్‌, ఒక బౌండరీ బాది జట్టుకు మెరుగైన స్కోరు సాధించిపెట్టింది. ఓవరాల్‌గా మంచిప్రదర్శన చేసిన స్మృతి మందానాకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

R Tripura Malini

R Tripura Malini

Next Story