తగ్గేదేలే.. సన్‌రైజర్స్‌ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Sunrisers Hyderabad Win by 7 Wickets
x

తగ్గేదేలే.. సన్‌రైజర్స్‌ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Highlights

PBKS vs SRH Highlights: తగ్గేదే లే.. ఇప్పుడు ఈ మాట సన్‌రైజర్స్‌ కు సరిగ్గా సరిపోతుంది.

PBKS vs SRH Highlights: తగ్గేదే లే.. ఇప్పుడు ఈ మాట సన్‌రైజర్స్‌ కు సరిగ్గా సరిపోతుంది. ఐపీఎల్‌ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో విజయం సాధించి వరుసగా నాలుగో విజయాన్ని కైవసం చేసుకుంది. 152 పరుగుల విజయలక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

హైదరాబాద్‌ బ్యాటర్లలో కేన్‌ విలియమ్సన్‌ (3) విఫలం కాగా.. మార్‌క్రమ్‌ (41*), నికోలస్‌ పూరన్‌ (35*), రాహుల్ త్రిపాఠి (34), అభిషేక్ శర్మ (31) రాణించారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 2, రబాడ ఒక వికెట్ తీశారు. కాగా, ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి ఎగబాకింది. టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 4 విజయాలు సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories