DC vs SRH: అదరగొట్టిన హైదరాబాద్.. వరుసగా నాలుగో విజయం..!

DC vs SRH: ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో 67 పరుగుల తేడాతో విజయం

Jyothi
Updated on: 21 April 2024 10:28 AM IST
Sunrisers Hyderabad Win By 67 Runs Against Delhi Capitals
X

DC vs SRH: అదరగొట్టిన హైదరాబాద్.. వరుసగా నాలుగో విజయం..!

DC vs SRH: ఐపీఎల్ 17వ సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతుంది. భారీ స్కోరు చేస్తూ ప్రత్యర్ధి జట్లకు సవాల్ విసురుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన 35వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల తేడాతోసూపర్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 266 భారీ స్కోర్ చేసింది.

భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ 19.01 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జెక్ ఫ్రేజర్ 18 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో ఢిల్లీకి పరాభవం తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లు నటరాజన్ 4, మయాంక్ 2, నితీష్ కుమార్ రెడ్డి 2, భువనేశ్వర్ , వాషింగ్టన్ సుందర్ లకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో నాల్గవ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో స్థానానికి చేరుకుంది.

Jyothi

Jyothi

Next Story