SunRisers Hyderabad: ఐపీఎల్ 2022 కోచింగ్ స్టాఫ్ ని ప్రకటించిన స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్

Sandeep Reddy
Published on: 23 Dec 2021 3:55 PM IST
SunRisers Hyderabad Team Management Announced Team Support Staff in Twitter
X

స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ (ట్విట్టర్ ఫోటో)

SunRisers Hyderabad: స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2022 కి సంబంధించి ఒక తాజా అప్డేట్ తో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ టీమ్ ట్విట్టర్ వేదికగా కోచింగ్ స్టాఫ్ ను ప్రకటిస్తూ ఒక వీడియోని పోస్ట్ చేసింది. అంత‌ర్జాతీయ‌ క్రికెట్‌లో సుదీర్ఘ కాలంపాటు రాణించిన లెజెండరీ క్రికెటర్లను ఈ ఏడాది స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్ గా చేర్చుకుంది. గతంలో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడిన డేల్ స్టెయిన్ ని పేస్ బౌలింగ్ కోచ్ గా నియమించగా..వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు బ్రియ‌న్ లారాను బ్యాటింగ్ కోచ్ గా, స్పిన్ బౌలింగ్ కోచ్ గా ముత్తయ్య మురళీధరన్, హెడ్ కోచ్ గా టామ్ మూడీ, ఫీల్డింగ్ కోచ్ గా హేమంగ్ బదాని, సైమన్ కటిచ్ అసిస్టెంట్ కోచ్ గా నియమించినట్లుగా ట్విట్టర్ ద్వారా తెలిపింది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story