SRH vs PBKS: పంజాబ్ పై సన్రైజర్స్ ఘనవిజయం.. రెండో స్థానానికి హైదరాబాద్

SRH vs PBKS: స్కోర్లు: పంజాబ్ 214/5, హైదరాబాద్‌ 215/6

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 May 2024 7:42 AM IST
Sunrisers Hyderabad Move to Second Spot After Comfortable Win Over Punjab Kings
X

SRH vs PBKS: పంజాబ్ పై సన్రైజర్స్ ఘనవిజయం.. రెండో స్థానానికి హైదరాబాద్

SRH vs PBKS: ఐపీఎల్ 17వ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట మరో రేంజిలో ఉంది. పంజాబ్ కింగ్స్ పై 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యఛేదనను సన్ రైజర్స్ టీమ్ మరో 5 బంతులు మిగిలుండగానే ఫినిష్ చేసింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు చేయగా... సన్ రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి విజయభేరి మోగించింది.

విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ (0) తొలి బంతికే వెనుదిరిగినా... మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తాను ఉన్నానంటూ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. మరో ఎండ్ లో రాహుల్ త్రిపాఠి 18బంతుల్లో 33 పరుగులు చేశాడు. తెలుగుతేజం నితీశ్ రెడ్డి మరోసారి తన పవర్ హిట్టింగ్ తో అలరించాడు.

ఇక, హెన్రిచ్ క్లాసెన్ కూడా తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుకుపడడంతో పంజాబ్ కింగ్స్ కు కష్టాలు తప్పలేదు. క్లాసెన్ 26 బంతుల్లో 42 పరుగులు చేసి ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, హర్షల్ పటేల్ 2, హర్ ప్రీత్ బ్రార్ 1, శశాంక్ సింగ్ 1 వికెట్ తీశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story