బోణీ కొట్టిన సన్‌రైజర్స్‌.. సీఎస్‌కేకు వరుసగా నాలుగో ఓటమి

Sunrisers Hyderabad Beat Chennai Super Kings by 8 wickets
x

బోణీ కొట్టిన సన్‌రైజర్స్‌.. సీఎస్‌కేకు వరుసగా నాలుగో ఓటమి

Highlights

IPL 2022: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బోణీ కొట్టింది.

IPL 2022: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బోణీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్‌ శర్మ (75), రాహుల్‌ త్రిపాఠి (39 నాటౌట్‌) రెచ్చిపోయి ఆడారు. ఫలితంగా ఎస్‌ఆర్‌హెచ్‌ మరో 14 బంతులు ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. హైదరాబాద్‌కిది తొలి విజయం కాగా.. చెన్నైకి వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories