Sunil Gavaskar: విరాట్ కోహ్లి తరువాత అతడే టీమిండియా కెప్టెన్..!!

* భారత టీ20 క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మనే కాబోయే కెప్టెన్ - సునీల్ గవాస్కర్

Sandeep Reddy
Updated on: 29 Sept 2021 5:03 PM IST
Sunil Gavaskar Says Rohit Sharma is the Next Team India T20 Captain After Virat Kohli
X

 విరాట్ కోహ్లి తరువాత అతడే టీమిండియాకి కెప్టెన్ (ఫైల్ ఫోటో) 

Sunil Gavaskar: టీ20 ప్రపంచ కప్ తరువాత భారత క్రికెట్ జట్టుకు కాబోయే కెప్టెన్ ఎవరో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే విరాట్ కోహ్లి రానున్న ప్రపంచకప్ తరువాత కెప్టెన్ బాధ్యతల నుండి తప్పుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

కెప్టెన్ గా ఉండటం వలన పూర్తి స్థాయిలో ఆటపై ఏకాగ్రత పెట్టలేనందునే అటు భారత టీ20 జట్టుకే కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు నుండి కూడా కెప్టెన్ గా తప్పుకుంటున్నట్లు తెలిపాడు.

తాజాగా ఆ విషయంపై స్పందించిన సునీల్ గవాస్కర్ ప్రపంచకప్ తరువాత కాబోయే కెప్టెన్ రోహిత్ శర్మ అని అందులో ఎలాంటి సందేహం లేదంటూ ప్రకటన చేశాడు. ఇప్పటికే ఐపీఎల్ లో నాలుగు సార్లు ముంబై ఇండియన్స్ జట్టుకు టైటిల్ ని అందించిన రోహిత్ భారత జట్టుకు కూడా కెప్టెన్ గా సరైనోడని అన్నారు.

ఇక వైస్ కెప్టెన్ విషయానికొస్తే మొదటగా కేఎల్ రాహుల్ కి ఎక్కువగా అవకాశాలున్నాయని అతనితో పాటు రిషబ్ పంత్ కి వైస్ కెప్టెన్ అయ్యే అవకాశాలున్నట్లు సునీల్ గవాస్కర్ ఒక ప్రకటనలో తెలియజేశాడు.

ప్రపంచ కప్ ముగిసిన తరువాత ఏ క్షణమైనా కోహ్లి కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోవచ్చని, ఆ వెంటనే రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం ఖాయమని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021 తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ గా బాధ్యతల నుండి తప్పుకుంటానని తెలుపడంతో ఈసారి బెంగుళూరు టీం టైటిల్ ని గెలిచి విరాట్ కోహ్లికి ఘనంగా వీడ్కోలు చెప్పాలని జట్టు సభ్యులు తహతహలాడుతున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story