Sunil Gavaskar: తల్లి మరణ వార్త తెలిసీ.. కామెంటరీ కంటిన్యూ చేసిన గవాస్కర్

Sunil Gavaskar: భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ సునీల్ గవాస్కర్ వార్తల్లో నిలిచారు.

Arun Chilukuri
Published on: 26 Dec 2022 4:55 PM IST
Sunil Gavaskar Continues With Commentary Duties Despite Mothers Death
X

Sunil Gavaskar: తల్లి మరణ వార్త తెలిసీ.. కామెంటరీ కంటిన్యూ చేసిన గవాస్కర్

Sunil Gavaskar: భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ సునీల్ గవాస్కర్ వార్తల్లో నిలిచారు. డిసెంబర్ 25న గవాస్కర్ తల్లి మీనల్ గవాస్కర్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఇదే సమయంలో గవాస్కర్.. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కి కామెంటరీ చెబుతున్నారు. అయితే మ్యాచ్ ముగిసే వరకూ కామెంటరీని కొనసాగించిన సునీల్ గవాస్కర్.. తన విధులను పూర్తి చేసుకున్న తర్వాత తల్లిని ఆఖరి చూపు చూసుకున్నారు. దీంతో వర్క్‌పై గవాస్కర్‌కు ఉన్న డెడికేషన్‌కు అంతా సలాం కొడుతున్నారు. తల్లి మరణ వార్త తెలిసినప్పటికీ సునీల్ గవాస్కర్ కామెంటరీ చెప్పి, తన వృత్తి నిబద్ధతని చాటుకున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story