అదరగోట్టిన హైదరాబాద్ .. ఢిల్లీ లక్ష్యం 220 పరుగులు!

అదరగోట్టిన హైదరాబాద్ .. ఢిల్లీ లక్ష్యం 220 పరుగులు!
x
Highlights

ఈ క్రమంలో వార్నర్‌ (66) అశ్విన్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి అక్షర్‌ పటేల్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. దీనితో హైదరాబాదు జట్టు మొదటి వికెట్ ని కోల్పోయింది. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్‌ పాండే, వృద్ధిమాన్‌ సాహాకి తోడయ్యాడు.

ఢిల్లీ, హైదరాబాదు జట్ల మద్య జరుగుతున్న ఆసక్తికరమైన పోరులో హైదరాబాద్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు వార్నర్‌, వృద్ధిమాన్‌ సాహా అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు చూడచక్కని షాట్లతో ఢిల్లీ బౌలర్లని ఓ ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాదు జట్టు చూస్తుండగానే 10 ఓవర్లలలో వంద పరుగుల మార్క్ ని దాటేసింది.

ఈ క్రమంలో వార్నర్‌ (66) అశ్విన్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి అక్షర్‌ పటేల్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. దీనితో హైదరాబాదు జట్టు మొదటి వికెట్ ని కోల్పోయింది. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్‌ పాండే, వృద్ధిమాన్‌ సాహాకి తోడయ్యాడు. ఇద్దరు కలిసి జట్టు స్కోర్ ని పరుగులు పెట్టించారు. జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతున్న సమయంలో నోర్జె బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించిన సాహా(87), శ్రేయస్ అయ్యర్‌ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 170గా ఉంది.

ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లు తమ కట్టుదిట్టమైన బౌలింగ్ తో హైదరాబాదు బాట్స్ మెన్స్ ను అడ్డుకున్నారు. ఇక 17 ఓవర్లలలో తుషార్‌ బౌలింగ్‌లో మనీష్‌ పాండే రెచ్చిపోయి రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. దీనితో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు గాను 219 పరుగులు చేసింది. విలియమ్సన్‌ (11) బౌండరీ బాదాడు. మనీష్‌ పాండే (44) పరుగులతో అజేయంగా నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories