Tokyo Paralympics 2020: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజతం

Tokyo Paralympics 2020: * బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో సుహాస్‌కు రజతం * లూకాస్‌ మజుర్‌ చేతిలో ఓడిన సుహాస్‌ యతిరాజ్‌

Arun Chilukuri
Published on: 5 Sept 2021 10:41 AM IST
Suhas Lalinakere Yathiraj Won Silver Medal for India at Tokyo Paralympics 2020 Badminton Men Singles | Sports News
X

సుహాస్ యతిరాజ్ (ఫోటో ది హన్స్  ఇండియా )

Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఎస్‌ఎల్‌ 4 విభాగంలో సుహాస్‌ యతిరాజ్‌ రజతం సాధించాడు. ఫైనల్‌ పోరులో ప్రపంచ నంబర్‌వన్‌, ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్‌ మజుర్‌ చేతిలో సుహాస్‌ ఓటమి పాలయ్యాడు. ఇక పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 18కి చేరింది. కాగా సుహాస్‌ యతిరాజ్‌ ఐఏఎస్‌ అధికారి. యూపీలోని నోయిడా జిల్లా మేజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story