Ind vs Sri Lanka T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

Sandeep Reddy
Updated on: 25 July 2021 8:08 PM IST
Ind vs Srilanka T20
X

ఇండియా వర్సెస్ శ్రీలంక జట్లు

India vs Sri Lanka T20: భారత్ శ్రీలంక జట్లు ఆదివారం ప్రేమదాస స్టేడియంలో టీ20 సిరీస్ లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ పోరుకి సిద్ధం అయ్యారు. ఇప్పటికే 2-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్, టీ20 లో కూడా విజయం సాధించి టీ20 సిరీస్ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో మొదటి మ్యాచ్ లో రంగంలోకి దిగుతుంది. ఇక టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఇప్పటివరకు జరిగిన 36 మ్యాచ్ లలో మొదటగా బ్యాటింగ్ చేసిన జట్టు 17 సార్లు గెలువగా, రెండవ బ్యాటింగ్ దిగిన జట్టు 18 సార్లు విజేతలుగా నిలిచినట్లు రికార్డులు చెబుతున్నాయి. భారత జట్టు కెప్టెన్ గా శిఖర్ ధావన్, శ్రీలంక జట్టు కెప్టెన్ గా దసున్ శనక వ్యవహరిస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్ తో పృథ్వీ షా మరియు వరుణ్ చక్రవర్తి మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడనున్నారు.

భారత జట్టు :

శిఖర్ ధావన్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, క్రునల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యుజ్వందర్ చాహల్, వరుణ్ చక్రవర్తి

శ్రీలంక జట్టు :

అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, అశెన్ బందార, ధనంజేయ డి సెల్వ, చరిత్ అస్లంక, దసున్ శనక, హసరంగా, కరునరత్నే, ఇసురు ఉదాన, అకిల ధనంజేయ, చమీర

Sandeep Reddy

Sandeep Reddy

Next Story